- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాతో భారత్ జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణుల కొనుగోలు డీల్ చేసుకుంది. జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణులు సహా పలు అత్యాధునిక ఆయుధాల విక్రయానికి అమెరికా అధికారికంగా గ్రీన్ సిగల్ ఇచ్చింది. మొత్తం 93 మిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ డీల్‌లో FGM-148 జావెలిన్ క్షిపణి యాంటీ ట్యాంక్ క్షిపణులు, 25 లైట్‌వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్లు మరియు 216 ఎక్సాలిబర్ ప్రెసిషన్-గైడెడ్ ఆర్టిలరీ రౌండ్లు ఉన్నాయి. ఆయుధాలతో పాటు శిక్షణ, నిర్వహణ, సాంకేతిక సహాయం వంటి కీలక మద్దతును కూడా అమెరికా ఇవ్వనుంది.
- Advertisement -



