నవతెలంగాణ-హైదరాబాద్: గాజాలో యుద్ధం ముగింపుకు ట్రంప్ సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ అంగీకరించిన విషయం తెలిసిందే. . ట్రంప్ ప్లాన్‌ను పలు దేశాలు స్వాగతిస్తున్నాయి. తాజాగా గాజాపై ట్రంప్ ప్రణాళికను భారత్ కూడా స్వాగతించింది.
గాజాలో యుద్ధం ముగించేందుకు ట్రంప్ చేసిన ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ట్రంప్ ప్రణాళిక పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతికి మార్గమని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.పోస్టు వైరల్ అవుతోంది. అదే విధంగా అరబ్ దేశాలు ట్రంప్ 20 సూత్రాల ఫార్ములకు మద్దతు పలికాయి.
కాగా, ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజాలో యుద్ధం ముగింపుకు ట్రంప్ 20 సూత్రాల శాంతి ఫార్ములాను సూచించారు. ట్రంప్ ప్లాన్‌కు ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది.
సోమవారం వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాకుండా.. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నట్లు నెతన్యాహు ఈ సందర్భంగా తెలిపారు.