Thursday, May 29, 2025
E-PAPER
Homeజాతీయంఅప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత - భారత్‌

అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత – భారత్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్థాన్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని భారత్‌ మరోసారి స్పష్టంచేసింది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని అమాయకులను ఈ ఉగ్రవాదులు బలితీసుకున్నారని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది. ఆపరేషన్‌ సిందూర్‌ తదనంతర పరిణామాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని భారత్‌ పునరుద్ఘాటించింది. జమ్మూ కశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్‌ అంగీకరించదని స్పష్టం చేసింది. పీవోకేను పాక్‌ ఖాళీ చేసే అంశం మాత్రమే మిగిలి ఉందని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -