- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ వరుస వికెట్లు కోల్పోతోంది. ఐదు ఓవర్లలోపే కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (5), సంజు శాంసన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1), అక్షర్ పటేల్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. తిలక్ వర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఒక వికెట్ తీశాడు. అభిషేక్ శర్మ (24), హర్షిత్ రానా క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లకు స్కోరు 49/5. ఆసీస్, భారత్ మధ్య మొత్తం అయిదు టీ20 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. క్యాన్‌బెరాలో జరిగిన తొలి టీ20 వర్షార్పణమైంది.
- Advertisement -

 
                                    