Saturday, May 3, 2025
Homeఆటలుభారత్‌ ఆడుతుంది!

భారత్‌ ఆడుతుంది!

– సీఏవీఏ వాలీబాల్‌ నేషనల్స్‌ లీగ్‌
న్యూఢిల్లీ : సెంట్రల్‌ ఆసియా వాలీబాల్‌ అసోసియేషన్‌ (సీఏవీఏ) మెన్స్‌ నేషనల్స్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ పోటీపడనుంది!. ఇటీవల నేపాల్‌లో జరిగిన ఏజీఎంలో పలు దేశాలు పాకిస్థాన్‌లో టోర్నమెంట్‌ నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆతిథ్య హక్కులను ఉబ్బెకిస్థాన్‌కు బదిలీ చేశారు. పాక్‌లో ఆడేందుకు తొలుత భారత వాలీబాల్‌ జట్టుకు ప్రభుత్వం ఎన్‌ఓసీ మంజూరు చేసినా, పహల్గాం ఉగ్రదాడి తర్వాత రద్దు చేసింది. తాజాగా వేదిక మార్పుతో భారత్‌ ఈ టోర్నమెంట్‌లో పోటీపడనుంది. ఈ మేరకు భారత్‌లో వాలీబాల్‌ సమాఖ్య వ్యవహరాలను పర్యవేక్షిస్తున్న అడ్‌హాక్‌ కమిటీ సెలక్షన్‌ ట్రయల్స్‌ను ప్రకటించింది. బెంగళూర్‌లోని సారు సెంటర్‌లో మే 6,7న సెలక్షన్స్‌ నిర్వహించి, అక్కడే శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నారు. 30 మంది బృందం టోర్నమెంట్‌కు వెళ్లనుండా.. 22 మంది ప్లేయర్లను రెండు రోజుల ట్రయల్స్‌ నుంచి ఎంపిక చేయనున్నారు. ఉబ్బెకిస్థాన్‌, భారత్‌, ఇరాన్‌, తుర్కేమిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌, పాకిస్థాన్‌లు ఈ టోర్నమెంట్‌లో పోటీపడనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img