Saturday, November 8, 2025
E-PAPER
Homeఆటలుటీ20 సిరీస్ భార‌త్ కైవ‌సం

టీ20 సిరీస్ భార‌త్ కైవ‌సం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బ్రిస్బేన్‌ వేదికగా టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్లు అయిదో టీ20 వర్షం కారణంగా రదైంది. తొలుత టాస్‌ గెలిచిన ఆసీస్‌..భార‌త్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 4.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. టీమ్‌ ఇండియా ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (23; 13 బంతుల్లో 1ఫోర్‌, 1 సిక్స్‌), శుభ్‌మన్‌ గిల్‌ (29; 16 బంతుల్లో, 6 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు. అయితే ఆట కొన‌సాగుతుండ‌గా ఉన్నట్లుండి ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. ఆటను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో కాసేపటి తర్వాత అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్‌ కూడా వర్షార్పణమైన విషయం తెలిసిందే. ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా అభిషేక్‌ శర్మ నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -