– 0-2తో ఆసీస్ చేతిలో ఓటమి
పెర్త్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టుకు హ్యాట్రిక్ పరాజయం ఎదురైంది. ఆసీస్-ఏతో తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన అమ్మాయిలు.. గురువారం పెర్త్ హాకీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లోనూ తేలిపోయింది. 0-2తో ఒక్క గోల్ కొట్టకుండానే ఓటమి చెందింది. కోర్ట్‌నీ 9వ నిమిషంలో గోల్‌తో ఆతిథ్య ఆసీస్‌కు శుభారంభం అందించింది. ఆఖరు క్వార్టర్‌లో గోల్ ప్రయత్నంలో టీమ్ ఇండియా మరో గోల్ కోల్పోయింది. 52వ నిమిషంలో గ్రేస్ స్టివార్ట్ గోల్ కొట్టడంతో 2-0తో ఆసీస్ విజయం సాధించింది. మ్యాచ్‌లో గోల్ వేటలో భారత అమ్మాయిలు పోరాట పటమి చూపించినా.. ఫలితం దక్కలేదు.
- Advertisement -