Saturday, October 25, 2025
E-PAPER
Homeఆటలునిలిచిన రో-కో..గెలిచిన భారత్

నిలిచిన రో-కో..గెలిచిన భారత్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కెప్టెన్సీ పోయింది… ఇక రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నాడంటూ వస్తున్న విమర్శలకు టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ తన బ్యాట్‌తో గట్టి సమాధానం చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో, చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. శతకం పూర్తి చేశాక హెల్మెట్ కూడా తీయకుండా, కేవలం బ్యాట్ పైకెత్తి సింపుల్ గా అభివాదం చేశాడు. రోహిత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలుపు ముంగిట నిలిచింది.

సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 38.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి విజయం అందుకుంది.. రోహిత్ శర్మ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 121 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులతో క్రీజులో నిలిచి భారత్ కు విజయ తీరలకు చేర్చబారు. లక్ష్య ఛేదనలో శుభ్‌మన్ గిల్ (24) త్వరగానే ఔటైనా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో రోహిత్ తన వన్డే కెరీర్‌లో 33వ సెంచరీ పూర్తి చేసుకోగా, కోహ్లీ 75వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అంతేకాకుండా, ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆసీస్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. రెన్‌షా (56) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో యువ పేసర్ హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటగా, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ముందుండి నడిపించడంతో ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం అందుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -