నవతెలంగాణ-హైదరాబాద్: రాయ్‌పూర్ వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈక్రమంలో టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. రెండు మార్పులతో రెండో టీ20లో భారత్ బరిలోకి దిగుతుంది. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా, అక్షర్ పటేల్‌కి తొలి టీ20లో గాయమైంది. వారి స్థానంలో కుల్ధీప్ యాదవ్, హర్షిత రాణా ఆడనున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఇండియా విక్టరీ సాధించింది. అంతకముందు జరిగిన వన్డే సిరీస్‌ను కీవీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో తేలిపోయిన న్యూజిలాండ్ నేడు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హర్దిక్ పాండ్య, శివం దూబె, రింకు సింగ్, కుల్ధీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత రాణా.
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), టిమ్ రాబిన్సన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డార్లీ మిచెల్, మిచెల్ శాంట్నర్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జెమీసన్, ఇశ్ సోధి, జాకబ్ డఫ్ఫీ.



