Wednesday, May 7, 2025
Homeఅంతర్జాతీయంభారత్‌ మెరుపుదాడులు.. 30 మంది తీవ్రవాదులు హతం!

భారత్‌ మెరుపుదాడులు.. 30 మంది తీవ్రవాదులు హతం!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత సైన్యం జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో మొత్తం 30 మంది ఉగ్రవాదులు హతం అయినట్లుగా తెలుస్తోంది. అయితే, బహవల్‌పూర్‌లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ మెరుపు దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమచారం. ఇదే విషయాన్ని పాక్ మీడియా ధృవీకరించినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -