- Advertisement -
- దమ్మామ్‌లో భారతీయుల సహకారం
- నవతెలంగాణ – రాయికల్
- గత ఎనిమిది రోజులుగా ఖతార్‌లో చిక్కుకున్న భారత జాతీయ బాస్కెట్‌బాల్ జట్టు ఎట్టకేలకు స్వదేశానికి బయలుదేరింది. జట్టులోని ప్రధాన కోచ్ ప్రసాద్ జీ, ఆటగాడు అరవింద్ సహా ఇతర సభ్యులు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా సౌదీ అరేబియాలోని దమ్మామ్ నగరానికి చేరుకున్నారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకత్వంలో జట్టును కింగ్ ఫాహ్ద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి, అక్కడి నుంచి భారతదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
- ఖతార్‌లో ఊహించని కారణాల వల్ల ఎనిమిది రోజులపాటు జట్టు అక్కడే ఉండాల్సి వచ్చింది.ప్రస్తుతం ఫ్లైనాస్ సంస్థ దమ్మామ్ నుండి భారతదేశానికి రోజువారీ విమానాలను నడుపుతుండటంతో జట్టు సభ్యులు తమ స్వదేశ ప్రయాణాన్ని కొనసాగించనున్నారు. ఈ సమయంలో దమ్మామ్‌లోని భారతీయులు జట్టుకు సహాయం అందించారు. సౌదీ అరేబియా తెలుగు సంఘం తూర్పు ప్రాంత అధ్యక్షుడు తేజ, జీసా అధ్యక్షుడు అనిల్ మల్పానీ, శ్యామ్ మోహన్ తదితరులు జట్టు సభ్యులకు అవసరమైన సహకారం అందించారు.
- అలాగే సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చా, సాటా వ్యవస్థాపకుడు మల్లేష్ జట్టు సభ్యులను అభినందించారు. ఎనిమిది రోజుల ఆలస్యం తర్వాత భారత బాస్కెట్‌బాల్ జట్టు సురక్షితంగా స్వదేశానికి బయలుదేరడం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



