నవతెలంగాణ ఢిల్లీ: అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా పేసర్లు సిరాజ్, బుమ్రా నిప్పులు చెరిగారు. వీరి ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది.
సిరాజ్ 14 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. బుమ్రా 14 ఓవర్లలో 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం.
గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్‌బెల్ 8, తేజ్‌నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.
ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.