నవతెలంగాణ-హైదరాబాద్: మూడో టీ20 మ్యాచ్‌లో బౌలర్ల హవా నడుస్తోంది.77 పరుగులకే సఫారీ టీం 7 కీలక వికెట్లు కోల్పోయింది. లైన్ అండ్ లెన్త్ బౌలింగ్ తో సఫారీ బ్యాటర్లను భారత్ బౌలర్లు హడలెత్తిస్తున్నారు. మెరుపు లాంటి వేగంతో ఆ జట్టు టాఫార్డర్ ను భారీగా దెబ్బతీశారు. మ్యాచ్ తొలి బంతి నుంచి ఇండియా బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. భారత్ బౌలర్ల ధాటికి ఆ జట్టు టాఫార్డర్ రీజా హెడ్రిక్స్, క్వింటన్ డికాక్ (WK), డేవాల్డ్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరెయిరా తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. హర్షిత్ రాణా,వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, హర్షదీప్, హార్థిక పాండ్యా, శివం దూబె తలో వికెట్ తీశారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఎడెన్ మార్క్రమ్(38), నోకియా క్రీజులో ఉన్నారు.
మూడో టీ20లో భారత్ బౌలర్ల హవా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



