- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో భారత సంతతికి చెందిన విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ వ్యూహకర్త యాష్లీ జె టెల్లిస్ అరెస్ట్ అయ్యారు. జాతీయ భద్రతకు సంబంధించిన పత్రాల కేసులో ఫెడరల్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా ఆయన వద్ద ఉంచుకున్నారన్న ఆరోపణలు అదుపులోకి తీసుకున్నట్లుగా వర్జీనియా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ యూఎస్ అటార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 64 ఏళ్ల ఆష్లే టెల్లిస్, వర్జీనియాలోని వియన్నాలోని తన ఇంట్లో దొరికిన వెయ్యి పేజీలకు పైగా అత్యంత రహస్య, రహస్య పత్రాలతో సహా జాతీయ రక్షణ సమాచారాన్ని చట్టవిరుద్ధంగా దాచుకున్నాడని అటార్నీ కార్యాలయం పేర్కొంది.
- Advertisement -