Wednesday, May 14, 2025
Homeఅంతర్జాతీయంబహమాస్‌లో భారత సంతతి విద్యార్థి మృతి

బహమాస్‌లో భారత సంతతి విద్యార్థి మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి బహమాస్‌లో మృతి చెందాడు. ఓ హోటల్‌ బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గౌరవ్ జైసింగ్‌(25) మసాచు సెట్స్‌లోని వాల్తామ్‌లోని బెంట్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాడు. ఈ వారంలోనే అతడి గ్రాడ్యుయేషన్ పూర్తికానుంది. ఈక్రమంలో తన స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లాడు. బహామాస్‌లోని ఓ హోటల్‌లో వారు బస చేశారు. ఆదివారం సాయంత్రం బాల్కనీలో తిరుగాడుతుండగా ప్రమాదవశాత్తూ అక్కడినుంచి కిందపడిపోయాడు. గమనించిన పలువురు స్పందించి అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే జైసింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. జైసింగ్‌ మృతి బాధాకరమని బెంట్లీ యూనివర్సిటీ ఎక్స్‌లో పేర్కొంది. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసింది. ఇక, జైసింగ్‌ మరణంపై దర్యాప్తు కొనసాగుతుందని అక్కడి అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -