నవతెలంగాణ-హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంగోలాలో ఘన స్వాగతం లభించింది. ఆ దేశాధ్యక్షుడు జోయో మాన్యువల్ గొన్కాల్వ్స్ లౌరెన్కో భారత్ రాష్ట్రపతిని స్వయంగా ఆహ్వానించారు. ఆదివారం ఆదేశ రాజధాని లువాండాలో సైనిక వందనంతో గౌరవించారు. విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజులు ఆంగోలాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య పలు అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత పలు రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. రాష్ట్రపతి పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి కృషి చేయనున్నారు.
ఆంగోలా పర్యటనతో తర్వాత భారత్ రాష్ట్రపతి నేరుగా బోట్స్వానా వెళ్లనున్నారు. నవంబర్ 11 నుంచి 13 వరకు రెండు రోజులు పర్యటించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్యం, ఔషధాలు, రక్షణ అంశాలపై ఇరుదేశాల నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు సాగనున్నాయి. అంతేకాకుండా బోట్స్వానా జాతీయ అసెంబ్లీని కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే విధంగా సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను సందర్శిస్తారు.



