- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావం మన సూచీలపై కనిపించింది. సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 24,432 మార్క్ ఎగువన ప్రారంభమయ్యాయి.
ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 287 పాయింట్ల లాభంతో 80,799 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు ఎగబాకి 24,434 దగ్గర కొనసాగుతోంది.
- Advertisement -