Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఆస్ట్రేలియాలో భార‌తీయ విద్యార్థిపై దాడి

ఆస్ట్రేలియాలో భార‌తీయ విద్యార్థిపై దాడి

- Advertisement -

నవతెలంగాణ – ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 19న అడిలైడ్‌లో భారత్‌కు చెందిన చరణ్‌ప్రీత్‌ సింగ్‌ తన భార్యతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో తమ కారును ఓ పక్కన పార్క్‌ చేసి నడుస్తుండగా, అకస్మాత్తుగా ఐదుగురు దుండగులు వేరే వాహనంలో అక్కడికి వచ్చి చరణ్‌పై భౌతిక దాడికి దిగారు. పదునైన వస్తువులతో కొడుతూ అతడిని దూషించారు. ఈ దాడిలో చరణ్‌ ముఖం, వెనక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. కారు పార్కింగ్‌ కారణంగానే వివాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆస్పత్రిలో చరణ్‌ మాట్లాడుతూ … ఈ దాడి తనను కలచి వేసిందన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలనిపిస్తుందన్నారు. ఇక, దాడికి పాల్పడిన దుండగుల్లో 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మిగిలినవారిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్‌ పీటర్‌ మాలినాస్కస్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి జాత్యహంకార దాడులను సహించేది లేదని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad