Monday, May 5, 2025
Homeజాతీయంపాక్‌పై భార‌త్ మ‌రో జ‌లాస్త్రం..స‌లాల్ ప్రాజెక్టు గేట్లు మూసివేత‌

పాక్‌పై భార‌త్ మ‌రో జ‌లాస్త్రం..స‌లాల్ ప్రాజెక్టు గేట్లు మూసివేత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఏప్రీల్ 22న జ‌రిగిన ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో..పాక్-ఇండియా మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు తీవ్ర‌స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన భార‌త్ ప్ర‌భుత్వం..పాకిస్థాన్ దేశంపై దౌత్య‌ప‌రంగా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. పాక్ విమాన స‌ర్వీసుల‌కు ఇండియా గ‌గ‌న‌త‌లాన్ని మూసివేసి, ఆదేశ పౌరుల‌కు జారీ చేసిన అన్ని ర‌కాల వీసా అనుమ‌తుల‌ను ర‌ద్దు చేసింది. పాక్ ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌తియ‌డానికి భారత్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ దేశానికి పూర్తిగా అన్ని ర‌కాల ఎగుమ‌తులు, దిగుమ‌తులను నిలిపి వేసింది. జ‌ల మార్గాల‌పై ప‌లు ఆంక్ష‌లు విధించి పాక్‌ను దెబ్బ‌మీద దెబ్బ కొట్టింది కేంద్ర ప్ర‌భుత్వం . అంతేకాకుండా దాయాదిపై జ‌లాస్త్రాన్ని ప్ర‌యోగించింది. 1960లో జ‌రిగిన సింధు జ‌లాల ఒప్పందాన్ని త‌క్ష‌ణ‌మే నిలిపివేసింది. ఇటీవ‌లె బాగ్లీహ‌ర్‌ ప్రాజెక్ట్ గేట్ల‌ను పూర్తిగా మూసివేసింది. తాజాగా రెండు దేశాల మ‌ధ్య కీల‌క ప్రాజెక్టు స‌లాల్ రిజ‌ర్వాయర్ గేట్లును కూడా పూర్తిగా మూసివేసింది. పాక్ వెళ్లాల్సిన వాట‌ర్ ప్లో ఘ‌న‌నీయంగా త‌గ్గాయి. రాంబన్‌లోని చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ జలవిద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట నుండి నీరు ప్రవహిస్తున్నట్లు కనిపించింది. దీంతో ఆదేశానికి వెళ్లాల్సిన నీరు పూర్తిగా ఆగిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -