Friday, November 7, 2025
E-PAPER
Homeబీజినెస్స్థితిస్థాపకతనుప్రదర్శిస్తున్నభారతదేశఆర్థికవ్యవస్థ, మార్కెట్లు

స్థితిస్థాపకతనుప్రదర్శిస్తున్నభారతదేశఆర్థికవ్యవస్థ, మార్కెట్లు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశ అత్యంత విశ్వసనీయ ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటైన పీఎల్  క్యాపి టల్, “హోల్డింగ్స్టెడీఇన్గ్లోబల్హెడ్‌విండ్స్” అనేతనతాజాఇండియాస్ట్రాటజీనివేదికలో అమెరికా టారిఫ్‌లు పెరగడం, H-1B వీసా ఫీజు పెంపుదల, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటి ప్రపంచ ఎదురుగాలులు ఉన్న ప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్లు అద్భుతమైన స్థితిస్థాపకతను ప్రదర్శిస్తూనే ఉన్నాయని పేర్కొంది.

సాధారణ రుతుపవనాలు, వడ్డీ రేట్లలో 100-బేసిస్ పాయింట్ల తగ్గింపు, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, FY26 బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను తగ్గింపులతో, వినియోగంలో బలమైన పునరుద్ధరణకు పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయని నివేదిక ప్రముఖంగా చాటిచెబుతోంది. జీఎస్టీ 2.0 అమలు ప్రపంచ సుంకాల ప్రభావాన్ని మరింతగా భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. అయితే 2026లో రాబోయే 8వ వేతన సంఘం గృహ సంబంధిత ఖర్చులకు అదనపు ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉంది. ఇది FY27 వరకు ఆర్థిక ఊపును కొనసాగించడంలో సహాయపడుతుంది. 2026 రెండో అర్థ వార్షికంలో డిమాండ్ పునరుద్ధరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 22 నుండి వినియోగదారుల డిమాండ్ బలంగా పుంజు కుందని, ఇది వాహన మరియు విచక్షణా విభాగాలలో కనిపిస్తుంది అని పేర్కొంది.

జీఎస్టీ పరివర్తన, అనేక పరిశ్రమలలో ట్రేడ్ డీ-స్టాకింగ్ కారణంగా 2QFY26 సంఖ్యలు అస్థిరంగా ఉంటాయని PL క్యాపిటల్ అంచనా వేసినప్పటికీ, రాబోయే త్రైమాసికాల్లో కన్జ్యూమర్ స్టేపుల్స్, డ్యూరబుల్స్, దుస్తులు, పాదరక్షలు మొదలైన వాటిలో బలమైన డిమాండ్ ధోరణులు ఉండవచ్చని భావిస్తోంది. జీఎస్టీ రేట్లలో వాహనరంగం పెద్ద రీసెట్‌ను చూసింది. అంతేగాకుండా పండుగ సీజన్ ప్రారంభం బలంగా ఉంది. ప్యాసింజర్ వాహననాలు, ద్విచక్ర వాహనాలు రెండింటికీ డిమాండ్‌లో బలమైన పెరుగుదల కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం.

రక్షణ, సెమీకండక్టర్లు, ఓడరేవులు, ఆనకట్టలు, అణుశక్తి మొదలైన వాటికి  పెట్టుబడి పెట్టడానికి బలమైన నిబద్ధతతో ఉన్నట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. అయితే, FY21 నుండి ప్రభుత్వ మూలధనం 3x కంటే ఎక్కు వగా ఉన్నందున పెరుగుతున్న ప్రభుత్వ ప్రోత్సాహం పరిమితం అయ్యే అవకాశం ఉంది. మొదటి ఐదు నెలల్లో భారత ప్రబుత్వం ద్వారా 43% అధిక మూలధన వ్యయం కనిపించింది. కేంద్రప్రభుత్వం ద్వారా పెరు గుతున్న కేటాయింపులు లేకపోతే మిగిలిన సంవత్సరం ఫ్లాట్ గా ఉంటుంది. డిమాండ్ పునరుద్ధరణ అనేది ప్రైవేట్ రంగ సామర్థ్య వినియోగాన్ని పెంచుతుంది. దానికి తోడుగా ప్రైవేట్ రంగ క్యాపెక్స్‌ను కూడా పెంచు తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -