నవతెలంగాణ-హైదరాబాద్: రెండో విడత బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పశ్చిమాసియా నెలకొన్న యుద్ధం కారణంగా భారత్ చమురు నిల్వలపై రాజ్యసభలో చర్చ జరగాలని పెద్దల సభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయని, గల్ప్ దేశాల యుద్ధాలు భారత్ పై అధిక ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. ఆయా దేశాల భీకర దాడులతో గల్ప్ దేశాలతోపాటు ఇరాన్ ఉన్న భారతీయుల భద్రత కోసం కేంద్రం తీసుకున్న చర్యలపై చర్చ జరగాలని ఆయన కోరారు. పశ్చిమాసియా యుద్ధం ఆ ప్రాంతానికే పరిమితం కాదని, పలు దేశాలతో పాటు భారత్ పై అధిక ప్రభావాన్ని చూపిస్తోందని ఆయన సభకు తెలియజేశారు.
భారత్ ఇందన నిల్వలపై సభలో చర్చించాలి: మల్లికార్జున ఖర్గే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



