నవతెలంగాణ-హైదారాబాద్: భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ప్రయోజనాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్ నుంచి భారత దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాక్ నుంచి ఎలాంటి వస్తువులు భారత్‌లో దిగుమతి కావడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఏప్రీల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో26మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా..పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పాక్ దేశంపై పలు దౌత్యపరమైన ఆంక్షలు విధించింది భారత్. సింధు జలాల ఒప్పందం నిలిపివేత, దాయాది దేశస్తులకు వీసా అనుమతులు రద్దు, ఆదేశ విమాన సర్వీసులకు గగనతలం మూసివేత తదితర నిర్ణయాలను భారత్ ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే.
భారత్ కీలక నిర్ణయం..పాక్ దిగుమతులపై నిషేధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES