నవతెలంగాణ-హైదరాబాద్: పాక్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ అలియాస్ సుదర్శన చక్ర కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ డ్రోన్లు, మిసైల్స్‌తో దాడికి ప్రయత్నించగా..వాటిని సుదర్శచక్ర మట్టికరిపించింది. తాజాగా ఈ క్రమంలోనే అదనపు యూనిట్ల కోసం రష్యాను భారత్ కోరింది. భారత్ విజ్ఞప్తికి రష్యా అంగీకారం తెలిపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రష్యాలో తయారు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఒకేసారి 36 టార్గెట్‌లను ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేసి ఛేదిస్తుంది. వీటిని రియాక్షన్ టైమ్ చేలా వేగంగా ఉంటుంది. ఎస్-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్‌డ్ అరే రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ మిస్సైల్ సిస్టమ్ కోసం భారత్ సుమారు రూ.35వేలకోట్లతో రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు ఐదు యూనిట్లు డెలివరీ తీసుకుంది.