Tuesday, May 13, 2025
Homeఅంతర్జాతీయంWTOకు భార‌త్ కీల‌క ప్ర‌తిపాద‌న‌..

WTOకు భార‌త్ కీల‌క ప్ర‌తిపాద‌న‌..

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్ర‌తీకార సుంకాల‌పేరుతో ట్రంప్ క‌ల్లోలం సృష్టించిన విష‌యం తెలిసిందే. భారత్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ లు విధించారు. తాజాగా భార‌త్ ప్ర‌భుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థకు కీల‌క ప్ర‌తిపాద‌న చేసింది. భారత్ లో ఉత్పత్తయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్ లకు ప్రతిస్పందనగా.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ లు విధించాలని ప్రతిపాదిస్తున్నట్లు WTOకు ఇండియా తెలిపింది. అయితే భారత్ క్రూడ్ స్టీల్ తయారీలో రెండో స్థానంలో ఉండగా.. ట్రంప్ టారిఫ్ ల ఎఫెక్ట్ ఆ రంగంపై పడనుంది. ఈ క్రమంలో భారత్.. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ లు విధించే అంశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద బలంగా ప్రస్తావించడం ఇరుదేశాల మధ్య వాణిజ్య ఘర్షణ పెరుగుతోందనేందుకు సంకేతంగా నిలిచిందనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -