నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో భారత్ పురోగతి సాధించింది. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 193 దేశాల్లో భారత్‌కు 130వ స్థానం దక్కింది. అంతకుముందు ఏడాది అంటే 2022తో పోల్చుకుంటే మూడు స్థానాలు మెరుగుపడింది. 2022 ఏడాదికి సంబంధించిన మానవాభివృద్ధి సూచీలో భారత్ 133వ స్థానంలో నిలిచింది. ఇక ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంకి సంబంధించిన మానవాభివృద్ధి సూచీ-2025 నివేదిక మంగళవారం విడుదలైంది. ఈ నివేదికలో 2023 ఏడాదికి సంబంధించిన డేటాను ప్రకటించారు. అదేవిధంగా లింగ అసమానత సూచీలో కూడా భారత్ వృద్ధిని నమోదు చేసింది. 2023లో మొత్తం 193 దేశాల్లో భారత్ 102వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది అంటే 2022లో 166 దేశాల్లో భారత్ 108వ స్థానం దక్కించుకుంది. అంటే ఈ ఏడాది ఆరు స్థానాలు మెరుగుపడింది. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ – 2025 ప్రకారం భారతీయుల జీవిత కాలం కూడా మెరుగుపడింది. 2023లో భారత పౌరుడి సగటు జీవితకాలం 72 ఏళ్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది అంటే 2022లో భారత పౌరుడి సగటు జీవితకాలం 71.7 ఏళ్లుగా ఉంది. ఇప్పటికే వరకు ఇచ్చిన నివేదికల్లో ఇదే అత్యధిక సగటు జీవితకాలమని యూఎన్‌డీపీ తెలిపింది. 1990లో భారత పౌరుడి సగటు జీవితకాలం అతితక్కువగా 58.6 ఏళ్లు ఉందని వెల్లడించింది.
మానవాభివృద్ధి సూచీలో భారత్ పురోగతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES