నవతెలంగాణ-హైదరాబాద్: మాల్ధీవులకు భారత్ ఆపన్నసాయం అందించింది. ఏకంగా 50 మిలియన్ల డాలర్లు ఆర్థిక సాయం చేసింది. ఈ మేరకు మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ ట్వీట్ చేస్తూ.. “50 మిలియన్ల డాలర్ల ట్రెజరీ బిల్లును రోల్‌ఓవర్ చేయడం ద్వారా మాల్దీవులకు కీలకమైన ఆర్థిక సహాయాన్ని అందించినందుకు EAM డాక్టర్ ఎస్ జైశంకర్, భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సకాలంలో సహాయం మాల్దీవులు & భారతదేశం మధ్య సన్నిహిత స్నేహ బంధాలను ప్రతిబింబిస్తుంది. కాగా గతంలో భారత ప్రధాని మోడీపై మాల్దీవ్స్ మంత్రులు సోషల్ మీడియా ద్వారా చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా దాదాపు 3 నెలలపాటు పర్యాటకం పూర్తిగా ఆగిపోయింది. దీంతో మాల్దీవ్స్ భారత్ తో శత్రుత్వం పెట్టుకొవడం మంచిది కాదని భావించి, ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పారు. అలాగే ప్రధానిపై, భారత్ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన మంత్రులను సైతం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
మాల్ధీవులకు భారత్ ఆపన్నహస్తం
- Advertisement -
- Advertisement -