నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. పెట్టుబడిదారులు అమెరికా ఫెడ్ రిజర్వ్ రేట్లపై అప్రమత్తత పాటించడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలు.. దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు తర్వాతి గంటల్లో ఒత్తిడికి లోనై పడిపోయాయి. ముఖ్యంగా హెల్త్‌కేర్, మెటల్, పవర్ రంగాల్లో నష్టాలు నమోదయ్యాయి. సెన్సెక్స్ 460 పాయింట్ల మేర క్షీణించగా.. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా తగ్గింది.
సెన్సెక్స్ ఈ ఉదయం 84,379.79 పాయింట్ల (క్రితం ముగింపు 84,404.46) వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 84,712.79 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 465.75 పాయింట్ల నష్టంతో 83,938.71 వద్ద స్థిర పడింది. నిఫ్టీ కూడా 155.75 పాయింట్లు నష్టపోయి 25,722.10 వద్ద ముగిసింది.
నష్టాల్లో ముగిసిన సూచీలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    