Saturday, May 17, 2025
Homeజిల్లాలు  పేదింటి వారి కళ నెరవేర్చలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లు

  పేదింటి వారి కళ నెరవేర్చలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

 కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి వారి కళ నెరవేర్చాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది అని ఐడిసి ఎమ్మెస్ మాజీ చైర్మన్ సాయి రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు పథకం సంబంధించి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో లబ్దిదారులకు ఇల్లు మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. ఇందుకు ఎంతగానో సహకరించినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి తెలంగాణ ఉద్యమకారుడు నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి, మునిపల్లి సాయారెడ్డిలకు లక్ష్మాపూర్ గ్రామం తరపున అలాగే లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐడీసీయంస్ మాజీ చైర్మన్ మునిపల్లి ముస్కు సాయారెడ్డి, మునిపల్లి సర్పంచ్ చిన్న సాయారెడ్డి గ్రామ పంచాయతీ సెక్రెటరీ, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ వినోద్ నరేష్, గ్రామ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -