Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తుఫాన్ లో ఇల్లు కూలిపోయిన బాధితులకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

తుఫాన్ లో ఇల్లు కూలిపోయిన బాధితులకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

- Advertisement -

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మల్లేష్ 
నవతెలంగాణ – అచ్చంపేట
తుఫాను కారణంగా వారం రోజులుగా కురిసిన వర్షాలకు అమ్రాబాద్ మండలంలో కొందరు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులు అయ్యారు. బాధితులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మల్లేష్ అన్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామములో కొన్ని ఇండ్లను శుక్రవారం సందర్శించారు. కుంచం గోవర్ధన్ తండ్రి నరసింహ గ్రామపంచాయతీ కార్మికుడు గత 30 సంవత్సరాల నుండి మన్ననూరు గ్రామంలోనే జీవిస్తున్నాడు. మంథ తుఫాన్ కారణంగా ఇల్లు కూలిపోయి నిరాశ్రయుడు. తుమ్మ చెట్ల పక్కనే తన ఇల్లు తడకలతో నిర్మించుకున్నాడు. ఇతనికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) అమ్రాబాదు మండల కార్యదర్శి ఎస్ మల్లేష్ డిమాండ్ చేశారు. గోవర్ధన్ కు ఇల్లు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండి సుల్తాన్ ,కృ ష్ణమ్మ, ఎండి సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -