Thursday, January 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల‌పై అస‌త్య ప్ర‌చారాలు మానుకోవాలి

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల‌పై అస‌త్య ప్ర‌చారాలు మానుకోవాలి

- Advertisement -
  • ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి గావిడి నాగబాబు

నవతెలంగాణ-కన్నాయిగూడెం: ఇటీవల కాలంలో జరిగిన స్థానిక ఎన్నికలలో మండలంలోని 2 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాకుండా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందడంతో..కాంగ్రెస్ నాయ‌కులు ఇందిర‌మ్మ బిల్లులు ల‌బ్ధిదారుల‌కు రావాని ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. వారి ప్ర‌చారాన్ని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి గావిడి నాగబాబు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందరికి ఒకేలా ఉంటాయని, అధికార పార్టీ నాయకుకి ఒకలా, ప్రతిపక్ష పార్టీ నాయకులకి ఒకలా ఉండవని అన్నారు. మండల వ్యాప్తంగా నిర్మాణదశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులో అందరికి సమానంగా వస్తాయని, అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాల‌ని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి గావిడి నాగబాబు అన్నారు. లేని యెడల రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ది ప్రజలు చెప్తారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -