నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కోటాకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు విచారణ జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాను సారం తనిఖీ బృందాలు ప్రశాంతంగా విచారణ చేస్తున్నారని ఎంపీడీఓ డదండ్యాల రామారావు తెలిపారు. మండలంలోని 27 పంచాయితీల్లో 100 శాతం తనిఖీ లు పూర్తి అయ్యాయని, జిల్లా అధికారులు ఆజ్ఞలు అందిన వెంటనే పంచాయితీ కార్యాలయాల్లో బహిరంగ ప్రదర్శన కు పెడతామని ఆయన అన్నారు. అర్హులైన వారు ఎవరూ అపోహాలకు గురి కావద్దని, ఇందిరమ్మ ఇండ్లపై వస్తున్న వదంతులు నమ్మవద్దని ఆయన వెల్లడించారు.
- Advertisement -