Wednesday, April 30, 2025
Homeఆదిలాబాద్ఇందిరమ్మ ఇల్లు అర్హులకే ఇవ్వాలి

ఇందిరమ్మ ఇల్లు అర్హులకే ఇవ్వాలి

 నవతెలంగాణ జన్నారం.

 మండలంలోని 29 గ్రామపంచాయతీలో, ఇందిరమ్మ ఇండ్లను అర్హులకే ఇవ్వాలని, అంబేద్కర్ యువజన సంఘం ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు తౌటు సంజీవ్ అన్నారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు, రేండ్లగూడలో  చాలామంది అరవులు ఉన్నప్పటికీ అర్హత లేని వారికి ఇళ్లను కేటాయించడం జరిగిందన్నారు. నాయకులు వారి బంధువులకు, వారి కార్యకర్తలకు  ఇల్లను ఇచ్చుకుంటున్నారు  తప్ప, అర్హత ఉన్న వారిని విస్మరిస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో  అర్హత ఉన్న వారిని గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుకున్నామన్నారు. లేకుంటే అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img