ఎంపీడీవో కృష్ణయ్య..
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇండ్లు ప్రోగ్రెస్ పరిశీలనలో భాగంగా మండల పరిధిలోని రాచాలపల్లి, గుడిగానిపల్లి గ్రామాలను సందర్శించారు. ఇప్పటివరకు మార్క్ ఔట్ ఇవ్వని లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా పనులను ప్రారంభించాలని, బేస్మెంట్ పూర్తి కాని వారు త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాలని, బేస్మెంట్ డబ్బులు వచ్చిన లబ్ధిదారులు గోడల పనులు రూఫ్ లెవెల్ వరకు పూర్తిచేసుకోవాలని సూచించారు. ఎల్ 3లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను తిరిగి వెరిఫికేషన్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఇందిర, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES