Thursday, April 9, 2026
E-PAPER
Homeజిల్లాలుమానవత్వానికి నిదర్శనం ఇందూరు యువత

మానవత్వానికి నిదర్శనం ఇందూరు యువత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-కంఠేశ్వ‌ర్: ఇందూరు యువత త‌మ మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. స్వచ్ఛంద సేవ సంస్థల‌ ద్వారా 168 అనాథ శవాలకు అంత్యక్రియలను చేశారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం గంగస్తాన్ ఫేజ్-1 లో గల యూవీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హాల్ నందు మానవత సేవ-2026 పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. మానవ సేవ మాధవ సేవ అని స్పూర్తితో ఇందూరు యువత స్వచ్ఛంద సేవలు ఆద‌ర్శ‌నీయ‌మ‌ని, వారి గొప్ప మానవత్వానికి నిదర్శనమని కొనియాడారు. ఈ త‌ర‌హా సేవ‌లు మాన‌వ‌త విలువ‌ల‌ను పెంపొందిస్తాయ‌న్నారు.

సాయిబాబు తన జీవితాన్ని సేవకి అంకితం చేసి 15 ఏండ్లగా చేస్తున్న సేవ కార్యక్రమాలు అందరికి ఆదర్శం అన్నారు
ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ నెల 11వ తేదీన కాశిలో అనాథల అస్థికలను కలిపి పిండ ప్రదానం చేసే కార్యక్రమానికి సంబంధించినా సేవ కార్యక్రమ పోస్టర్లను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్,యువి ఫౌండేషన్ ఫౌండర్ సుజన్ కుమార్
మరియు ఇందూరు యువత కార్యవర్గం జయదేవ్ వ్యాస్,మద్ది గంగాధర్,సుజాత రెడ్డి, దర్శనం రాజు, బోడ హనుమడ్లు, విజయానంద్, సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Indore youth is a testament to humanity
Indore youth is a testament to humanity
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -