నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రీల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..పాకిస్థాన్ దేశంపై దౌత్యపరంగా కఠినమైన ఆంక్షలు విధించింది. 1960లో ఇరుదేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేసింది. అదేవిధంగా సలాల్, బాగ్లీహార్ ప్రాజెక్టుల గేట్లు మూసివేసి పాక్‌ను తావుదెబ్బ కొట్టింది. ఈ క్రమంలో తాజాగా షరిఫ్ ప్రభుత్వం భారత్ ప్రభుత్వానికి కీలక లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందంపై సమీక్షించుకోవాలని పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా.. భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఓ అధికారిక లేఖ రాసారు. భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేలా భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. పహల్గాం దాడికి పూర్వమే..పలుమార్లు సింధూ జలాల ఒప్పందాన్ని పునర్ సమీక్షించాలని పాక్‌ను పలుమార్లు కోరింది. అయినా కానీ నిమ్మకు నీరెత్తిన చందంగా షరిష్ ప్రభుత్వం వ్యవహరించింది. తాజా పరిణామాలతో ఖంగుతిన్న పాక్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని పునర్ సమీక్షించాలని భారత్‌కు లేఖ రాయడం గమనార్హం.
సింధు జలాల ఒప్పందాన్ని పునః సమీక్షించాలి: పాక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES