Wednesday, May 14, 2025
Homeజాతీయంసింధూ జలాల ఒప్పందం నిలిపివేత

సింధూ జలాల ఒప్పందం నిలిపివేత

- Advertisement -

– సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు ఆపే వరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మీడియాకు వెల్లడి
న్యూఢిల్లీ:
ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్తాన్‌ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని అమాయకులను ఈ ఉగ్రవాదులు బలి తీసుకున్నారని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు నిలిపివేసే వరకూ సిం ధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది. ఆపరేషన్‌ సిందూర్‌ తదనంతర పరిణామాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
ద్వైపాక్షిక చర్చలే శరణ్యం..
ఇక పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే) పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని భారత్‌ పునరుద్ఘాటించింది. జమ్మూ కాశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్‌ అంగీకరించదని స్పష్టం చేసింది. పీవోకేను పాక్‌ ఖాళీ చేసే అంశం మాత్రమే మిగిలి ఉందని వెల్లడించింది.
భారత్‌ వైఖరి సుస్పష్టం
”కాల్పుల విరమణపై మా వైఖరి సుస్పష్టం. ప్రపంచ దేశాల నుంచి సంప్రదింపులు జరిపిన వారితోనూ ఇదే విషయాన్ని చెప్పాం. ఉగ్రవాదులను అణచివేయడమే భారత్‌ ప్రాథమిక లక్ష్యం. ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడి చేసింది. ప్రతిగా పాక్‌ దుస్సాహసానికి దిగింది. ప్రతిచర్యగానే భారత్‌ దాడులు చేసింది. వాళ్లు కాల్పులు నిలిపివేస్తే భారత్‌ దాడులు ఆపేస్తుంది. ఇదే విషయాన్ని ప్రపంచదేశాలకు చెప్పాం. మేము చెప్పిన విషయాన్ని ప్రపంచ దేశాల నాయకులు పాక్‌కు చెప్పి ఉంటారు. భారత్‌ చెప్పిన విషయాన్ని పాక్‌ పెడచెవిన పెట్టింది” అని రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -