నవతెలంగాణ-హైదరాబాద్: భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మహిళల జట్టు 2-0తో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో 252 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. జార్జియా వోల్ 101, బెథ్ మూనీ 31, లిచ్‌ఫీల్డ్ 80 రన్స్ చేశారు. భారత బౌలర్లలో కాష్వీ గౌతమ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. క్రాంత్రి గౌడ్ ఒక వికెట్ తీసింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్ బ్యాటర్లు ప్రతీక రావల్ (52; 81 బంతుల్లో, 6 ఫోర్లు), హర్మన్ ప్రీత్ (54; 70 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. స్మృతి మంధాన (31), కాశ్వీ గౌతమ్ (25), రిచా ఘోష్ (22) ఫర్వాలేదనిపించారు. క్రాంతి గౌడ్ (19), అమన్ జ్యోత్ కౌర్ (13), జెమీమా రోడ్రిగ్స్ (11), దీప్తి శర్మ (1) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. శ్రీ చరణి (10), వైష్ణవి శర్మ (0) నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో గార్డనర్, అన్నాబెల్, అలానా కింగ్ తలో 2, మేగాన్ షట్, నికోలా కేరీ చెరో వికెట్ తీసుకున్నారు.
INDw Vs AUSw: వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం
- Advertisement -
- Advertisement -



