- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొత్త నియమితులైన సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బొరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్, మొహిసినా పర్వీన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో వారు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.
- Advertisement -