Saturday, July 12, 2025
E-PAPER
Homeజాతీయంప్రేమ‌జంట‌పై ఒడిశాలో అమానుషం..తాలిబన్ తరహా శిక్షలు

ప్రేమ‌జంట‌పై ఒడిశాలో అమానుషం..తాలిబన్ తరహా శిక్షలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: పెళ్లి చేసుకోవడమే వారు చేసిన తప్పు. యువ జంట వివాహం స్థానిక ఆచారాలకు విరుద్ధం అని పాశవికంగా దాడి చేశారు. వీరి కలయిక సమాజంలో నిషిద్ధం అంటూ ఘోరమైన శిక్షలు వేశారు. అవమానించారు. ఆధునిక యుగంలోకూడా ఇలాంటి ఘటనలు కలవరం చేపుతున్నాయి. ఒడిశాలోని రాయగడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అది ఒడిశాలోని రాయగడ జిల్లాలోని కంజామఝిరా గ్రామం.. ఈ గ్రామంలో ఓ యువ జంట స్థానిక ఆచారాలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నారని దారుణమైన శిక్షను ఎదుర్కొన్నారు. స్వయాన అత్తకొడుకున్న పెళ్లాడిన యువతికి ఘోర అవమానం, దారుణమైన శిక్ష. అక్కడి సాంప్రదాయ నమ్మకాల ప్రకారం.. వారిది దగ్గర సంబంధంగా భావిస్తారు. వారిద్దరి కలయిక నిషిద్ధం. వివాహం చట్టబద్ధమైనప్పటికీ ఈ సంబంధం తోటి గ్రామస్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొంది. వారు ఈ సంబంధాన్ని ఆమోదయోగ్యం కాని ఆచార ఉల్లంఘనగా భావించారు.
ఎద్దుల్లా పొలం తున్నించారు..

ఆచారం ప్రకారం.. వారు చేసింది తప్పు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అని గ్రామస్థులు అవమానకరమైన దారుణమైన రీతిలో ప్రవర్తించారు. ఆ జంటను బహిరంగంగా అవమానపర్చారు. వారిని వెదురు ,చెక్క దుంగలతో తయారు చేసిన కాడికి కట్టారు. ఇది ఎద్దులు దున్నడానికి ఉపయోగించే కాడి లాంటిది. ఎద్దులా వారితో పొలం దున్నించారు. దీనికి సబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -