- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో అంగన్వాడి కేంద్రంలో ఉపాధి హామీ పథకం లో రెండు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం జరిగిందని జిపి కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి రమణ సురేష్ గొండ మాట్లాడుతూ గ్రామంలో అవసరం ఉన్నచోట ఉపాధి హామీ క్రింద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని సూచించారు. అదేవిధంగా గ్రామ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, వార్డ్ సభ్యులు,
కె.మల్లుగొండ, ఉపాధి హామీ కూలీలు, బాబు, సైదయ్య, మనోహర్, ఎం.రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



