Tuesday, December 2, 2025
E-PAPER
Homeఖమ్మంపాఠశాలలో వినూత్న కార్యక్రమం

పాఠశాలలో వినూత్న కార్యక్రమం

- Advertisement -

– పుస్తక సమీక్షకుల క్లబ్ ఏర్పాటు
– గ్రంథాలయం నిర్వహణకు దోహదం
– పుస్తకం మంచి నేస్తం
 – హెచ్.యం.పరుచూరి హరిత 
నవతెలంగాణ – అశ్వారావుపేట
: అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రంధాలయ నిర్వహణలో భాగంగా విద్యార్ధులచే పుస్తక సమీక్షకుల క్లబ్ ను ఏర్పాటు చేసారు.  ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత మాట్లాడుతూ పుస్తకం మంచి నేస్తం అని ఆ పుస్తకాన్ని చదవడమే కాకుండా పుస్తక ప్రియులను తయారుచేయడం కోసం సమీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్ధులలో పుస్తక సమీక్ష చేసే అలవాటు ను పెంపొందించడం కోసం క్లబ్ ను ఏర్పాటు చేసామన్నారు.  ప్రముఖ సాహితీవేత్త సి.ఆర్.పి సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ పాఠకులకు పుస్తకాన్ని రుచి చూపించడమే పుస్తక సమీక్ష అని సమీక్షకులు పుస్తకంపై తన భావాలను వెలిబుచ్చి ముందుగానే పాఠకుల మెదళ్ళు లో ఆ పుస్తకంపై మక్కువ పెంచుకోవడానికి, ఆసాంతం చదవాలనే దృక్పధాన్ని సమీక్షకులు కల్పిస్తారని ఆ విధమైన లేఖ నా సామర్ధ్యాన్ని ఆలోచనా విధానాన్ని విద్యార్ధులలో కల్పించడానికి ఈ క్లబ్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. క్లబ్ గౌరవాధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయురాలు హరిత, కన్వీనర్ గా గ్రంధాలయ ఇంచార్జి, తెలుగు ఉపాధ్యాయులు పుల్లయ్య, విద్యార్ధి కన్వీనర్ గా యం.డి. తహసీన్, బాధ్యతలు చేపట్టారు. ఈ క్లబ్ నిర్వహణలో ప్రతీ నెలా సమీక్షా పోటీలు ,సమన్వయ సమావేశాలు జరిపి పుస్తక పఠనాశక్తిని పెంపొందిస్తామని ప్రధానోపాధ్యయురాలు హరిత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింహారావు,హరిబాబు,దుర్గయ్య, రమాదేవి,వెంకటేశ్వరరావు విద్యార్ధులకు పుస్తక సమీక్షా విధానం,గ్రంధాలయాన్ని వినియోగించుకునే విధానాన్ని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -