కమల్ హాసన్ హీరోగా, మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కు తున్న హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘థగ్ లైఫ్’ జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిం చిన ఈ చిత్రంలోని మొదటి సాంగ్ ఇప్పటికే విశేష శ్రోతకా దరణ పొందింది. ఈనెల 17న ట్రైలర్ ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ఈనెల 24న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ జరగనుంది. ఈనెల 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. అంతకు ముందు, చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది.