Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయంఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఉదయగిరిల‌ జ‌ల‌ప్ర‌వేశం

ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఉదయగిరిల‌ జ‌ల‌ప్ర‌వేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారత రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం మరోసారి తన సత్తాను చాటింది. దేశీయ నావికాదళానికి ఊతమిచ్చేలా రెండు నీలగిరి క్లాస్‌ యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరిలను భారత నావికాదళం ప్రారంభించింది. ప్రాజెక్ట్‌ 17 ఆల్ఫా (పి-17ఎ)లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రెండు యుద్ధనౌకలను రూపొందించారు. మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ రెండు నౌకలు సముద్ర జలాల్లోకి ప్రవేశించాయి.

ఐఎన్‌ఎస్‌ నీలగిరి అనే యుద్ధనౌకను ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభించారు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా 75శాతం స్వదేశీ పరిజ్ఞానంతో హిమగిరి మరియు ఉదయగిరిలను రూపొందించారు. హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ మరియు ఇంజనీర్స్‌, ఉదయగిరిని ముంబయిలోని మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ నిర్మించాయి. ఇవి రెండు అభివృద్ధి చెందుతున్న భారతదేశ నౌక నిర్మాణ నైపుణ్యం మరియు ప్రధాన రక్షణ షిప్‌యార్డ్‌ల మధ్య సమన్వయాన్ని చూపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటితో భారత్‌ ఇప్పుడు దేశీయంగా రూపొందించిన, పారిశ్రామిక-సాంకేతిక సామర్థ్యాన్ని, ప్రాంతీయ శక్తి సమతుల్యతను ప్రదర్శించే మూడు యుద్ధనౌకలను కలిగి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -