- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలోని ఒకటో వార్డులో వీధిలైట్ లేక కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారని ఒకటో వార్డు సభ్యులు పందుల నీత రాజేష్ సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించి సర్పంచ్ బుధవారం ఒకటో వార్డులోని స్తంభాలకు నూతన లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డులోని ప్రతి సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. వార్డులు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
- Advertisement -


