- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్డినెన్స్‌ను తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మెన్ శనివారం హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో మేధావులతో సమావేశమయ్యారు. రిజర్వేషన్లు అమలు కావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఎదురయ్యే అవాంతరాలు, అందుకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. సమావేశంలో బీసీ కమిషన్ చైర్మెన్ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మితో పాటు మేధావులు, అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -