Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవేల్పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

వేల్పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

- Advertisement -

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌
ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లిన కాంగ్రెస్‌ నాయకులు నంగి దేవేందర్‌రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్‌పల్లి
నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజక వర్గం వేల్పూర్‌ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘కనువిప్పు’ పేరుతో కాంగ్రెస్‌, ‘చలో వేల్పూర్‌’ పేరుతో బీఆర్‌ఎస్‌.. గురువారం ఇరుపార్టీలు పిలుపు నేపథ్యంలో వేల్పూర్‌లో పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు సీపీ సాయిచైతన్య ముం దస్తు చర్యలు తీసుకున్నారు. వేల్పూర్‌లో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ముందుగానే మండలంలో 163 బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ అమలుకు ఆదేశించారు. అయితే పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వేల్పూర్‌లో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరి స్తానంటూ బయల్దేరేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మానాల మోహన్‌రెడ్డిని పోలీ సులు జిల్లా కేంద్రంలో గృహనిర్బంధం చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ఆయా గ్రామా ల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులను కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్‌ స్టేష న్లకు తరలించారు. పలువురిని హౌస్‌ అరెస్ట్‌లో ఉంచారు. అయినప్పటికీ అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఎమ్మెల్యే ఇంటి వద్దకు పెద్దఎత్తున తరలి వచ్చేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని వాహనాల్లో తర లిస్తుండగా మండల కాంగ్రెస్‌ మహిళా అధ్య క్షులు స్వరూప అడ్డుపడటంతో ఉద్రిక్తత వాతా వరణం నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు నంగి దేవేందర్‌ రెడ్డి.. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంటిపైకి రావడంతో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు అతనిపై దాడికి దిగారు. దాంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి నంగి దేవేందర్‌ రెడ్డిని అక్కడినుంచి బయటకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంటి వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దఎత్తున గుమ్మికూడారు. వేల్పూర్‌ లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు వచ్చిన ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ రెడ్డి.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చ రించారు. మీడియాతో వేర్వేరుగా మాట్లాడిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
దాడి అమానుషం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్‌ అనుచరుల దాడి అమానుషమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ తన దాడుల్ని ఆపకుంటే బీఆర్‌ఎస్‌ తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి చేసిన వారిని వదిలేసి తమ పార్టీ నేతలను అరెస్టు చేయటమేంటని ప్రశ్నించారు. ప్రశాంతి రెడ్డి ఇంటిపై దాడి చేసినవారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘటన విషయమై ప్రశాంత్‌రెడ్డితో కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ొ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లిన కాంగ్రెస్‌ నాయకులు నంగి దేవేందర్‌రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్‌పల్లి
నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజక వర్గం వేల్పూర్‌ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘కనువిప్పు’ పేరుతో కాంగ్రెస్‌, ‘చలో వేల్పూర్‌’ పేరుతో బీఆర్‌ఎస్‌.. గురువారం ఇరుపార్టీలు పిలుపు నేపథ్యంలో వేల్పూర్‌లో పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు సీపీ సాయిచైతన్య ముం దస్తు చర్యలు తీసుకున్నారు. వేల్పూర్‌లో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ముందుగానే మండలంలో 163 బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ అమలుకు ఆదేశించారు. అయితే పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వేల్పూర్‌లో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరి స్తానంటూ బయల్దేరేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మానాల మోహన్‌రెడ్డిని పోలీ సులు జిల్లా కేంద్రంలో గృహనిర్బంధం చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ఆయా గ్రామా ల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులను కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్‌ స్టేష న్లకు తరలించారు. పలువురిని హౌస్‌ అరెస్ట్‌లో ఉంచారు. అయినప్పటికీ అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఎమ్మెల్యే ఇంటి వద్దకు పెద్దఎత్తున తరలి వచ్చేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని వాహనాల్లో తర లిస్తుండగా మండల కాంగ్రెస్‌ మహిళా అధ్య క్షులు స్వరూప అడ్డుపడటంతో ఉద్రిక్తత వాతా వరణం నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు నంగి దేవేందర్‌ రెడ్డి.. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంటిపైకి రావడంతో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు అతనిపై దాడికి దిగారు. దాంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి నంగి దేవేందర్‌ రెడ్డిని అక్కడినుంచి బయటకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంటి వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దఎత్తున గుమ్మికూడారు. వేల్పూర్‌ లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు వచ్చిన ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ రెడ్డి.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చ రించారు. మీడియాతో వేర్వేరుగా మాట్లాడిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
దాడి అమానుషం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్‌ అనుచరుల దాడి అమానుషమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ తన దాడుల్ని ఆపకుంటే బీఆర్‌ఎస్‌ తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి చేసిన వారిని వదిలేసి తమ పార్టీ నేతలను అరెస్టు చేయటమేంటని ప్రశ్నించారు. ప్రశాంతి రెడ్డి ఇంటిపై దాడి చేసినవారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘటన విషయమై ప్రశాంత్‌రెడ్డితో కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -