Monday, February 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

- Advertisement -

నతవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,89,126 మంది, సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. ఇందుకోసం స్టేట్ వైడ్‌గా 1,495 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రైవేటు కాలేజీలతో పాటు 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలు కూడా ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. విద్యార్థులు వెబ్‌సైట్ (tgbie.cgg.gov.in) నుంచి లేదా కళాశాలల నుండి హాల్ టికెట్లు పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -