Sunday, July 20, 2025
E-PAPER
Homeక్రైమ్ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

ఆర్మూర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో ఘటన
నవతెలంగాణ-ఆర్మూర్‌
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని పిప్రి రోడ్డులో గల తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీలో శనివారం ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్‌, పీఈటీపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంతోష్‌(17) సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో ఇంటర్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సంతోష్‌ గ్రౌండ్‌లో వ్యాయామం చేశాడు. ఆ తర్వాత కనిపించకపోయేసరికి అతని కోసం వెతకగా.. కళాశాల వెనుక చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెంటనే కాలేజీకి వచ్చి కొడుకుని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సంతోష్‌ మృతి విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్‌, పీఈటీ నిర్లక్ష్యం ఉందంటూ అతని అన్న గడ్డం శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పంచనామా చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -