నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హెచ్ నితిన్ 1000 మార్కులకుగాను 869,సి హెచ్ మలంగ్ తేజ-806, ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థులు .వినోద్-955,యం.బాల్ రాజ్918 మార్కులతో జిల్లా,మండల టాపర్లుగా నిలిచారని ప్రిన్సిపాల్ ఏ సుధాకర్,వైస్ ప్రిన్సిపాల్ డా బి.వెంకట్ లు తెలిపారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో యం పీ సి ప్రథమ సంవత్సరం.అజయ్ 464/470,బి.జగన్ 461/460,బైపీసీప్రథమసంవత్సరములో.బాలాజీ-424/440,సి.హెచ్ నితిన్-383/440 మార్కులను సాధించి జిల్లా, మండల టాపర్లుగా నిలిచారని చెప్పారు.ఇంటర్ ప్రథమ సంవత్సరములో 61 శాతము,ద్వీతీయ సంవత్సరములో 76 శాతము ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు.
టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఏ సుధాకర్,వైస్ ప్రిన్సిపాల్ డా బి.వెంకట్,ఉప సంక్షేమాధికారి బి.సుమన్, ఉపన్యాసకులు జి రాము,నరహరి ప్రసాద్ ,జే.గణేశ్, గంగాప్రసాద్, దత్తాత్రేయ, సి హెచ్ రాచప్ప,సంజు లు అభినందించి, శుభాకాంక్షలను తెలిపారు.




