బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటిం చిన చిత్రం ‘కర్మణ్యే వాదికారస్తే’. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్‌లో ఫైట్స్, గన్ ఫైరింగ్, రొమాన్స్, థ్రిలింగ్ వంటి సన్ని వేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్‌లో బీజీఎమ్ హైలెట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఉషస్విని ఫిల్మ్స్ బ్యానర్ పై డిఎస్‌ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మిస్తున్నారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకుడు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హీరో మాస్టర్ మహేంద్ర మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్‌లో మరొక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సినిమా మీద ఉన్న నమ్మకంతో ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్రహ్మాజీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది’ అని అన్నారు.
‘ట్రైలర్ మాదిరిగానే సినిమా కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. నామీద నమ్మకంతో ఈ సినిమాని నిర్మించి, మంచి కంటెంట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న మా ప్రొడ్యూసర్‌కి ధన్యవాదాలు’ అని డైరెక్టర్ చల్లపల్లి అమర్‌దీప్ అన్నారు.
ప్రొడ్యూసర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ,’డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. దీంతో ఈ సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించాను. ఈ సినిమాని ఒక చిన్న సినిమాగా కాకుండా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాగా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, ‘ఈ రోజుల్లో సినిమా అనేది థియేటర్ల వరకు వెళ్లాలి అంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒక మంచి కంటెంట్ ఉంటే అది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అనే భేదం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’ అని చెప్పారు.
ఆసక్తికరంగా ‘కర్మణ్యే వాదికారస్తే’
- Advertisement -
- Advertisement -